సిరిసిల్ల డిపో నుంచి దైవదర్శన టూర్ ప్యాకేజీ
న్యూస్ పవర్ , 13 జూలై , సిరిసిల్ల :
సిరిసిల్ల డిపో నుండి స్పెషల్ టూర్ ప్యాకేజీ లో భాగంగా ఐదవ బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఇంత కు ముందు వెళ్లినటువంటి టూర్ ప్యాకేజీ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్పినటువంటి విజ్ఞప్తులు ఏమనగా చిలుకూరు బాలాజీ, భద్రాచలం. పంచరామాలు, సింహాచలం , అన్నవరం , రామప్ప, లక్నవరం ఇలాంటి సందర్శనలు మునుముందు ప్రయాణికుల సౌకర్యార్థం కల్పించాలని వారు కోరారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే
యాదగిరిగుట్ట-సురేంద్రపురి-బంగారు శివ లింగం-స్వర్ణగిరి టెంపుల్స్ దర్శనానికి స్పెషల్ డీలక్స్ బస్సును నడుపుతున్నట్లు సిరిసిల్ల డీఎం ప్రకాశ రావు తెలిపారు తేది 20-07-2025 ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి డీలక్స్ బస్సు బయలుదేరి యాదగిరిగుట్ట, సురేంద్రపురి, బంగారు శివ లింగం, స్వర్ణగిరి దేవాలయాల దర్శనానం తరం తిరిగి అదే రోజు రాత్రి సిరిసిల్లకు చేరు తుందని తెలిపారు. పెద్దలకు రూ.750, పిల్లల కు రూ.450 చార్జీ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టిఐ వర్జిలాల్. టిఐ3 బాపురెడ్డి, టిడిపి చైర్మన్ రామ్ రెడ్డి నాయక్ , సంతోష్ నాయక్ , మల్లేష్ ,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.పూర్తి వివరాలకు ఈ క్రింద ఇచ్చినటువంటి నంబర్లను సంప్రదించాలని కోరారు
90634 03971, 99592 25929, 73828 50611, 63041 71291, 94946 37598